Thursday, March 12, 2026

గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్

కమిటీల నియామకంలో ‘చెన్న’ దూకుడు

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్):
ఎమ్మార్పీఎస్ ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో తలపెట్టిన వెయ్యి గొంతులు-లక్ష దప్పులు కార్యక్రమంను విజయవంతం చేయడమే సంకల్పంగా ఎస్సీ ఎ.బి.సి.డి వర్గీకరణ సాధనే లక్ష్యంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ బలోపేతం చేయడం కోసం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెన్న కుమారస్వామి ఆద్వర్యంలో మండలంలోని గ్రామాల్లో వరుస కమిటీల నియామకం చేస్తూ దూకుడు పెంచింది. గురువారం చర్లపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులుగా చుంచు అనిల్ నియమకం జరుగాగ శుక్రవారం మారెడుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులుగా చిలుముల మెండయ్య, ఉపాధ్యక్షులుగా దాగెటి ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి చిలుముల క్రిష్ణ, అధికార ప్రతినిధి చిలుముల చిన్న అంజయ్య, ప్రచార కార్యదర్శి గద్దల దుర్గయ్య, కోశాధికారి చిలుముల పెద్ద అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా చిలుముల రాయమల్లు. గుల్లకోట గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఓరుగంటి నాగేష్, ఉపాధ్యక్షులుగా జంగిలి లచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా రామగిరి వెంకటేష్, అధికార ప్రతినిధిగా మిట్ట నరేష్, కోశాధికారిగా ఉప్పులేటి సాయికిరణ్, ప్రచార కార్యదర్శిగా దావుల నారాయణ, కార్యదర్శిగా ఉప్పలేటి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శిలుగా జంగిలి లక్ష్మణ్, రామగిరి సురేష్, గౌరవ అధ్యక్షులుగా చుంచు మల్లేశం, సలహాదారులుగా జంగిలి రమేష్, చుంచు శంకర్, ముఖ్య సలహాదారులుగా దావుల దామోదర్ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ అధ్యక్షులుగా దావుల జీవన్, ఉపాధ్యక్షులుగా రామగిరి శ్రావణ్, ప్రధాన కార్యదర్శిగా రామగిరి నవీన్, స్పోక్ పర్సన్ గా రామగిరి రాజకుమార్, ప్రచార కార్యదర్శిగా ఉప్పులేటి అజయ్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెన్న కుమారస్వామి మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో మాదిగల ఐఖ్యత అభ్యున్నతికి పాటు పడుతూనే ఎస్సీ ఎ.బి.సి.డి వర్గీకరణ జరిగే వరకు పోరాడాలని సూచించారు. అనంతరం నూతనంగా నియమకైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News