Monday, March 16, 2026

బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్

నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో గురువారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీ బట్టు తిరుపతి రావడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థినీ, విద్యార్థులచే ప్రార్థన కార్యక్రమం ముగిసిన వెంటనే రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కమిషనర్ బట్టు తిరుపతి బహుమతి ప్రధానోత్సవం చేశారు. మున్సిపల్ కమిషనర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు, క్రమశిక్షణకు మారుపేరు సరస్వతీ శిశుమందిర్ అని విద్యార్థులు కష్టపడి సమయపాలన పాటించి ఉన్నత విద్యాభ్యాసం పొందేలా భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉండేలా ఎల్లప్పుడూ కష్టపడి చదవాలని సూచించడం జరిగింది. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కమిషనర్ తిరుపతి పాఠశాల పక్షాన సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు గోపు వెంకటేష్, ప్రబంధకారిణి కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, పాఠశాల కరస్పాండెంట్ కోశాధికారి నీలి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొండబత్తిని అమర్నాథ్ మరియు ప్రబంధ కారిణి మరియు సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News