నేటి సాక్షి, మందమర్రి:-
పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని చెతలపూర్ లో గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ ను పురపాలక పరిపాలన శాఖ ప్రాంతీయ సంచాకులు షాహిద్ మసూద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనతోపాటు వరంగల్ ప్రజా ఆరోగ్య శాఖ, సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్, ఆదిలాబాద్ పబ్లిక్ హెల్త్ డివిజన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్, బయో మైనింగ్ కు సంబంధించిన ఏజెన్సీ ప్రతినిధులు డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ సైట్ ను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డంపింగ్ యార్డ్ లో ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, మున్సిపల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి, శానిటరీ ఇన్స్పెక్టర్ వి శ్యాంసుందర్, రెవెన్యూ అధికారి పి కృష్ణ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ బంగారి శ్రీనివాస్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం గోపికృష్ణ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.





