Sunday, March 29, 2026

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  • కార్మికులకు రూ. 26వేల వేతనం ఇవ్వాలి
  • మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు అజ్జు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ హుజురాబాద్ అధ్యక్షులు అజ్జు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కార్మికుల పరిష్కరించాలని కోరుతూ స్థానిక కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్మికుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు. చాలీచాలని వేతనాలతో కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 అందించాలన్నారు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్మికులకు చెప్పులు, సబ్బులు, బట్టలు, బెల్లం, నూనె ఇవ్వాలన్నారు. విలీన గ్రామాల కార్మికులకు పాత బకాయి వేతనాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సరోజన, కోశాధికారి రాజేశ్వరి, కార్యదర్శి బోరగాల కుమార్, నాయకులు సులోచన, చిరంజీవి, బిక్షపతి, అన్నపూర్ణ, ఐలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News