- పట్టణ ప్రజల్లో పలు రకాల అనుమానాలు
నేటిసాక్షిబ్యూరో, నిజామాబాద్, టిఎన్ రమేష్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని, హమాల్వాడి లో నరేష్ అనే 34 సంవత్సరాల వ్యక్తి, ఆత్మహత్య చేసుకున్నట్లు, గుర్తించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. గత శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు, మృతుడి భార్య మూడవ పట్టణ పోలీసులకు తెలిపింది. భార్యాభర్తల మధ్య కలహాల కారణంగా నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, మృతుడు నరేష్ భార్య తెలియజేయటం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నిజామాబాద్ నగరంలోని పలువురు, ఇది హత్య లేక ఆత్మహత్య అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కారణం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అతడు ఉరి వేసుకున్న తాడు కానీ, చీర కానీ, చున్నీలాంటి మరే ఇతర వస్తువైనా, మృతుడి మెడకు వెనుక భాగంలో ముడిపడి ఉంటుంది. కానీ ఈ సంఘటనలో, మృతుడి ముందు భాగం గొంతు దవడ పై భాగంలో చీర లాంటి దానితో ఉరి, ముడి వేసుకొని ఉండడం గమనించవచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటే మృతుడు నిలబడి ఉన్నట్లుగానీ, భూమి నుండి అతడి శరీరం పైకి ఉన్నట్లుగాని కనిపించడం లేదు. మృతుడు మొత్తం తన మోకాళ్లపై భూమిని అని ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. మరి పోలీసుల పంచనామా ఏం చెబుతోంది, ప్రభుత్వ వైద్యుల పోస్టుమార్టం రిపోర్టు ఏం చెప్పనుంది, అనే అనేక రకాల సందేహాలు ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి.నరేష్ ది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసు అధికారులు దృష్టి కేంద్రీకరించాలని, పలువురు పట్టణవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో మృతుడు నరేష్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, కారణం శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, దీంతో మనస్థాపానికి గురైన నరేష్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో, ఉరి వేసుకొని మృతి చెందినట్లు అతడి భార్య పోలీసులకు తెలిపారు. ఇట్టి విషయాన్ని కాలనీవాసులు, ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, మూడో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా పూర్తిస్థాయి విచారణ జరిపి ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు జరిపితే కచ్చితంగా అన్ని విషయాలు బయటకు వస్తాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

