నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి):
పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాల లో హార్ట్ బీట్ ఫౌండేషన్ ఫర్ ది విజువల్లి ఇంపైర్డ్ హైదరాబాద్ వారిచే సంగీత విభావరి నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల హెచ్ ఎం సుధాకర్ మాట్లాడుతూ చూపు లేకున్నా ఇతరులపై ఆధారపడకుండ తమకు తామే సహాయం చేసుకోకుండా వారివాలె బాధపడుచున్న అనేక అందులకు సహాయం అందిస్తూ ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగుతున్న వారి బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రెడ్ హార్ట్ ఫౌండేషన్ వారిని పాఠశాల కరెస్పాండంట్ ఆర్. వి రమణారావు ప్రత్యక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తమ గాత్రం తో, మిమిక్రీ, మోటివేషన్ క్లాస్ తో విద్యార్థులని ఉత్సాహ పరచిన విజువల్లి ఇంపైర్డ్ ఫౌండేషన్ బృందాన్ని డైరెక్టర్ మణి మేడం అభినందించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.