- మండల మహిళ సమాఖ్య సభ్యులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
- మహిళ సాధికారత కేంద్రం స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ సుమ
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా 18 : గ్రామీణ ప్రజలందరూ బ్యాంకులు అందిస్తున్న సేవల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని మహిళా సాధికార శాఖ కేంద్రం ఫైనాన్షియల్ లిట్రసి సుమ అన్నారు. శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖలోని జిల్లా మహిళా సాధికారిక కేంద్రం అధ్వర్యంలో ఘణపూర్ మండలంలో మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత పై మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన మొదలగు పథకాల గురించి వివరించారు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా 10 ఏళ్ల లోపు బాలికలకు పొదుపు ఖాతాలను తెరవాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యతను ప్రజల్లో పెంపొందించడానికి ఆర్థిక మోసాలను అరికట్టడానికి, ఆర్థిక మోసాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పూర్తి ఆర్థిక అక్షరాస్యతను సాధించాలని కోరారు. సైబర్ క్రైమ్, బాలల చట్టాలు, చైల్డ్ లేబర్, బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్స్ బాలలకు 1098, సైబర్ క్రైమ్ సంబంధించి 1930, మహిళలకు గృహహింస 181, పోలీస్ 100, వయోవృద్ధులు 14567 టోల్ ఫ్రీ నెంబర్లు వాటి ఉపయోగాల గురించి మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక కేంద్రం స్పెషలిటీ ఫైనాన్షియల్ లిట్రేసీ సుమ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యమ్మ, ఏపిఎం రాంబాబు, సఖి కేంద్రం కేస్ వర్కర్ శ్రావణి, మిషన్ పరివర్తన కమ్యూనిటీ ఎడ్యుకేటర్ సాయి లీల, వివోఏలు, ఈసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





