రోడ్డు ప్రమాదాల బారిన పడొద్దు. వాహనదారులకు అవగాహన కార్యక్రమం…!!!మద్యం సేవించి వాహనాలు నడపరాదు ఆర్టీవో నిబంధనలు పాటించాలి…!!!రోడ్డు భద్రత వారోత్సవాల ర్యాలిని ప్రారంభించిన వనపర్తి జిల్లా రవాణాశాఖ అధికారి మానస…!!!


నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :
బుధవారం వనపర్తి జిల్లా రవాణా శాఖ కార్యాలయము నందు రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మానస అవగాహన ర్యాలీ నిర్వహించారు. వనపర్తి జిల్లా రవాణా అధికారి మానస ముందుగా వాహనదారులకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపారు. రవాణాశాఖ కార్యాలయం నందు రోడ్డు భద్రత అవగాహన ప్రదర్శనను డి టి ఓ మానస, ఏవో సాబేర భాను, ఏఎంవిఐ సైదుల్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో కరపత్రాలను వాహన దారులకు పంపిణీ చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి మానస మాట్లాడుతూ, రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా టు వీలర్, ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సంవత్సరం జనవరి 1 నుండి జనవరి 31 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతాయాన్నారు. వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, సీటు బెల్టు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం ద్వారా తదితర పరిణామాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ వాహన నడిపే డ్రైవర్లకు గులాబి పువ్వును అందించారు. వనపర్తి జిల్లా నాగవరం సమీపంలో గత పది నెలల క్రితం ప్రమాదానికి గురై ముగ్గురు మృతి చెందారన్నారు. ఈ రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నైపుణ్యం లేని డ్రైవింగ్ కారణమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల తలకు గాయమై చాలా మంది చనిపోతున్నారని, ద్విచక్ర వాహన చోదకులందరూ హెల్మెట్ ధరించాలని కోరారు. హెల్మెట్ వినియోగం మరియు వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ఏవో సాబేర బాను,
ఏఎంవిఐ సైదుల్, ఆర్టీవో స్టాప్స్ డీపీఏలు సుజీవన్ రెడ్డి, నరేష్ కుమార్, హోంగార్డ్స్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

