Monday, March 23, 2026

బెజ్జంకి ప్యాక్స్ ను సందర్శించిన నాబార్డ్ బృందం

  • చైర్మన్ శరత్ రావు, పాలకవర్గాన్ని అభినందించిన నాబార్డ్ బృందం

నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి ప్యాక్స్  అభివృద్ధి లో వేగవంతం అయిన సందర్భంగా బేస్ లైన్ సర్వే లో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము బెజ్జంకి ని  నాబార్డ్ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాక్స్ లో జరుగుతున్నా అభివృద్ధిని లోన్స్ ని రైతులకు అందుతున్న సౌకర్యాలను  సంఘ భవనాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా ఛైర్మెన్ తన్నీరు శరత్ రావు,పాలక వర్గాన్ని అభినందించారు, మండలంలో సాగు వివరాలను పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు.నాబార్డ్ నుండి పాక్స్ కు రైతులకు ఏవిధమైన సహకారం చేయగలము అని పంటలకు ఎలాంటి పంటలతో రైతులకు అధిక దిగుబడి మరియు లాభాలు వచ్చుటకు చేయవలసిన కార్యక్రమాలు, ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేయుటకు రైతులకు అవగాహన కల్పించుటకు ప్రోత్సహించాలని తెలిపారు. రైతులు ప్రతి సంవత్సరం పంట మార్పిడి లో బాగంగా కూరగాయల పెంపకం, చిరుధాన్యాలు పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సలహాలు పలు రకాల సూచనలు ఇవ్వడం జరిగింది. సంఘం నుండి 21.60 లక్షల లోన్ హార్వేస్టర్ కొరకు గాదె రాజు కు ధీర్గకాలిక లోన్ ఇవ్వడం జరిగినది .ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ తన్నీరు శరత్ రావు గారు,  నాబార్డు బృందం మేనేజర్ బి.రమేష్ బాబు, సి.వి.హరిహయన్,నిది తివారి,ఆర్యన్ సక్సేన,కె.కామేష్వర్ రావు,జయ ప్రకాశ్,దిలిప్ చంద్ర, సత్య ప్రసాద్,ఉపాధ్యక్షులు బండి రమేష్ మరియు పాలక వర్గ సభ్యులు తిరుపతి రెడ్డి, నరేష్ బాబు,శ్రీనివాస్ రెడ్డి,భూమయ్య,బాలనర్సు,రాజేషం,బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్,ఫీల్డ్ ఆఫిసర్ దుర్గప్రసాద్,సిఈఓ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News