నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ లో నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ పరకాల క్రాస్ రోడ్ పెద్ద పాపయ్యపల్లి వారి ఆధ్వర్యంలో పుల్లూరి ప్రభాకరరావు మేనేజింగ్ డైరెక్టర్ డైరీలో పనిచేసే ఉద్యోగులందరికీ మానసిక శారీరక ఉల్లాసాన్ని కల్పించడానికి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈనెల 23 నుండి 25 వరకు పోటీలు జరుగుతాయి. మొదటి రోజున క్రికెట్ మ్యాచ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమయింది. ఉద్యోగస్తులందరూ ఐదు టీములుగా ఏర్పడి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ తోపాటుగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజురాబాద్ మాజీ వైస్ చైర్మన్ కబడ్డి శ్రీనివాస్, డైరీ డైరెక్టర్ గణేష్ రావు, సీఈవో కృష్ణ ప్రసాద్, ఏజీఎం సుధాకర్, ప్రోక్యుమెంట్ ఏజీఎం వెంకటస్వామి, ప్లాంట్ మేనేజర్ శ్రీనివాస్, గణపతి సీడ్స్ రజనీకాంత్ మరియు వివిధ విభాగాల మేనేజర్లు, సిబ్బంది, స్థానిక క్రీడాకారులు, పాత్రికేయులు, ప్రముఖులు పాల్గొన్నారు.





