Thursday, March 19, 2026

పేరు కే గన్నేరువరం మండలం

  • నిధులు లేవు అభివృద్ధి లేదు
  • ప్రభుత్వం కార్యాలయాలకు సొంత భవనాలు లేవు
  • ఎందుకు నిర్లక్ష్యం

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): ప్రభుత్వం మారినా,పాలకులు మారినా కానీ గన్నేరువరం మండల అభివృద్ధి మాత్రం మారలేదు అని మండల ప్రజలు అనుకుంటున్నారు. నూతన మండలం ఏర్పాటు అయి దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్నా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో కూడా పక్క భవనాలు గురించి, మండలం అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు అని మండల కాంగ్రెస్ ప్రభుత్వం పాలకుల పై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం పక్క భవనాలు లేక అటు ప్రజలు ఇటు అధికారం యంత్రాంగం నానా తంటల పడుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు అని మండలం ప్రజలు ఎదురు చూస్తున్న అదిగో ఇదిగో అని రాజకీయ నాయకులు మాటలు కు నమ్మి ఓట్లు వేస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది గన్నేరువరం మండల పరిస్థితి మండలం కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, వంద పడకల ఆసుపత్రి, భవనాలు లేక ఉద్యోగుల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా నేతలు నాయకులు అధికారులు స్పందించి పక్క భవనాలు నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News