Thursday, March 26, 2026

అంగరంగ వైభవంగా నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో నక్కలగుట్ట శ్రీ లక్ష్మినరసింహస్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం ఆలయ కమిటీ ఆధ్వర్ంయలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర పుణ్యక్షేత్ర అర్చకులు గిరిధరచార్యుల పర్యవేక్షణలో వేదపండితులు వెంకటరమణ, వెంకటకృష్ణ సమక్షంలో పూజలు అందుకున్న స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వేదిక వద్దకు తీసుకువచ్చి వేద మంత్రోత్సరణల మధ్య కల్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులు వారి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. సాయంకాల వేల సతీ సమేతంగా నరసింహ స్వామీ రథంలో భూపతీపూర్ పుర వీదులగుండ బయలు దేరి భక్తులకు దర్శన భాగ్యం కలిగించాడు. ఈ రథోత్సవ కార్యక్రమంలో అధిక మొత్తంలో భక్తులు హాజరై స్వామి వారి కృపకి పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సంకోజీ మహేష్,మాజీ ప్రజాప్రతినిధులు జక్కుల చంద్ర శేఖర్, అన్నవేని వేణు, మహేశ్వర్ రావు, నిమ్మల శేఖర్, విండో చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు హాజరయ్యారు. కాగ ఈ ఉత్సవంలో జగిత్యాల బిజెపి ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదానం ప్రారంభించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News