ఇసుక, బెల్లం, బియ్యం జోరుగా రవాణా
డోర్నకల్ ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్

నేటి సాక్షి, నర్సింహులపేట :
నర్సింహులపేట మండలంలో రాత్రి ఆకేరు వాగు ఇసుక అక్రమ రవాణా, తెల్లవారు జామున బెల్లం, బియ్యం దందా కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ దందాలను అరికట్టాల్సి ఉండగా కొందరు నాయకులు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మండలంలోని రామన్నగూడెం కౌసల్యదేవిపల్లి కొమ్ములవంచ జయపురం గ్రామాల గుండా ఆకేరువాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది అధికార పార్టీ నేతలే అండగా ఉండి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని వివిధ ప్రాంతాల్లో నల్లబెల్లం, పట్టికను పోలీసులు దాడులు చేసినప్పటికీ వారి కళ్లుగప్పి అమ్మకాలు చేస్తున్నారు. ఇటీవల తీర పోలీసులు వచ్చేసరికి బెల్లం మూటలు పొలంలో వదిలేసి తప్పించుకున్నారు. చివరికి పోలీస్ అధికారులు బెల్లం ముఠాలను పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై డోర్నకల్ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక బెల్లం బియ్యం దందాలు చేసే ఎంతటి వారినైనా ఉపేక్షించరాదని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలను కొందరు లీడర్లు ధిక్కరిస్తూ అక్రమ వ్యాపారాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారంతో కొందరు, అధికారులను అడ్డుపెట్టుకుని మరికొందరు అక్రమ దందాలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లు పట్టుకోగానే సొంత పార్టీ నాయకులే అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. ఆకేరువాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమ దందాలను అరికట్టాల్సి ఉండగా కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఓ తండకు చెందిన కాబోయే ప్రజాప్రతినిధిగా చెప్పుకుంటున్న వ్యక్తితోపాటు నియోజకవర్గ నాయకుడిగా చెలామణి అవుతున్న మరోవ్యక్తి బెల్లం సరఫరా చేస్తూ పోలీసులను చూసి వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. ఎవరు దందా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని డోర్నకల్ ఎమ్మెల్యే హెచ్చరించినా ఆగడం లేదు. పల్లెల్లో గుడుంబా విచ్చలవిడిగా లభిస్తుండడంతో నాటుసారా వ్యసనపరులు పండుగ చేసుకుంటున్నారు. ఖరీదైన కార్లలో బియ్యం, నల్లబెల్లం తరలిస్తూ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. పల్లెల్లో గుడుంబా విచ్చలవిడిగా లభిస్తుండడంతో నాటుసారా వ్యసనపరులు పండుగ చేసుకుంటున్నారు. అయితే తమ జేబులను గుల్ల చేసుకుని, ఆర్థికంగా, శారీరకంగా నష్టపోతూ చివరికి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. గుడుంబా మహమ్మారి ఇంతలా గ్రామాలను పట్టి పీడిస్తుంటే, సంబంధిత ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం పట్ల మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ దందాలు కొనసాగిస్తున్న నాయకులపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.





