- పాఠశాలలో ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నోకరికులం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కాకతీయ పాఠశాలలో విద్యార్థులకు అసోసియేట్ ప్రొఫెసర్ కె. నరేందర్ రెడ్డి చేతుల మీదుగా నాసా కిట్లని అందజేశారు. శుక్రవారం రోజు పాఠశాలలో ప్రిన్సిపాల్ మాట్ల సందీప్ కుమార్ అధ్యక్షతన నాసా కిట్ల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నాసా యొక్క ప్రాముఖ్య్యాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని వారి యొక్క లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆ లక్ష్యాల వైపు శాస్త్రీయ పరిజ్ఞానంతో పయనించాలని ఆకాంక్షించారు. అసోసియేట్ ప్రొఫెసర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫిజిక్స్ యొక్క ప్రాముఖ్యతను అది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మల్లెంపాడు శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం రాజు, కోఆర్డినేటర్ ప్రవీణ్, శ్రీనివాస్, నాసా ఇన్చార్జ్ వినీత అలాగే ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.