Monday, March 16, 2026

జాతీయ బీసీ సంక్షేమ సంఘం కట్ట లింగంపేట గ్రామ కమిటీ ఎన్నిక..

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి: (సతీష్)
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో జిల్లా అధ్యక్షుని మేకల పరుశురాం సూచన మేరకు మండల అధ్యక్షులు అమరబండ ప్రసాద్,ఆధ్వర్యంలో కట్ట లింగంపేట గ్రామ కమిటీ ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా. మారుపాక లక్ష్మణ్, అధ్యక్షులుగా ఎల్లా దశరథం, ప్రధాన కార్యదర్శిగా మారుపాక పరశురాములు, ఉపాధ్యక్షులుగా మార్పాక మహేష్, ఎల్లా నరేష్, కోశాధికారిగా తోకల ప్రసాద్, కార్యదర్శిగా జంగిలి ప్రసాద్, జంగిల్ శ్రీనివాస్, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా గుడిపల్లి హరీష్, కార్యవర్గ సభ్యులుగా ఏనుగుల పరశురాములు, ముద్దుల కొమురయ్య, గుడిపల్లి రాజు, తిరుమల కుంటయ్య, అవారి తిరుపతి, వీరిని ఏకగ్రీవంగా నియమించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్ , మాట్లాడుతూ..నూటికి 55 శాతం బీసీలకు ఇప్పటివరకు మంత్రిత్వ శాఖ లేదు, మరియు బీసీలకు ఎమ్మెల్యే స్థానాలకు ప్రత్యేక రిజర్వేషన్ స్థానాలు ఇప్పటివరకు లేవు, చట్టసభల్లో బీసీలు ఉన్నప్పుడే విద్య,ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమ వాట తమకు దక్కే అవకాశాలు ఇప్పటికైనా సాధించుకుందాం అన్నారు.బీసీలంతా ఎకతాటిపైకి వచ్చి బీసీల హక్కుల కోసం పోరాటం చేయాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో ,మండల ముఖ్య సలహాదారు తిప్పని నరసయ్య,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిగుర్ల మల్లేశం,తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News