
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలకేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీల ఉద్యమాన్ని ఆపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అధ్యక్షుడైన మ్యాకల పరశురాం కు ఫోన్ కాల్ ద్వారా బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి రెడ్డి వెని పరుశురాం, జిల్లా కార్యదర్శి సిలువేని మల్లేశం, వేములవాడ అర్బన్ బీసీ సంక్షేమ సంఘం, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కాసర్ల అరుణ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా బీసీలను ఐక్యం చేస్తూ ముందుకు సాగుతున్న మా జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించడం జరిగిందని, ఇట్టి సంఘటనను బిసిలందరం తీవ్రంగా ఖండించాలని కోరారు. ఇట్టి బెదిరింపు ఫోన్ కాల్ పై జిల్లా ఎస్పీకి పిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. నూటికి 60 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక ఎన్నికల్లో 27 శాతం ఉన్న రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని జిల్లా వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తూ నూతన కమిటీలు వేస్తూ బీసీలను ఏకతాటిపైకి తతీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఇది చూసి ఓర్వలేకనే కొందరు బీసీ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.





