- అవిలాల చెరువు అభివృద్ధి ప్రణాలికలు
- పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
నేటి సాక్షి, ప్రతినిధి, తిరుపతి: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయి ప్రణాలికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవిలాల చెరువును ఎన్జిటి నిబంధనలకు లోబడి అభివృద్ధి చేయుట కొరకు పూర్తి స్థాయిలో ప్రణాలికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు అవిలాల చెరువు అభివృద్ధిపై పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్, చెరువు కరకట్ట బలోపేతం చేయడం తదితర అంశాలను, వాటికి అవసరమయ్యే నిధుల అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో తుడా సెక్రెటరీ డా. వెంకట నారాయణ, ఎస్.ఈ కృష్ణారెడ్డి ఈఈ రవీంద్ర, ఉద్యాన శాఖ అధికారిణి మాలతి, టిటిడి ఈఈ మనోహర్, ఇరిగేషన్ ఈఈ ప్రసాద్, ఆర్కిటెక్ట్ రఘురామన్ తదితరులు పాల్గొన్నారు.

