భద్రాద్రి కొత్తగూడెం నేటి సాక్షి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 19 :
విజయవాడ నుండి ఛత్తీస్గఢ్ వెల్లె నేషనల్ హైవే 30 భద్రాద్రి కొత్తగూడెం చండ్రుగుండ మండల పరిధిలో గల అయినపాలం గ్రామంలో మూల మలుపువద్ద మరియు మద్దుకురు గ్రామంలో కూడా అదే రకమైన మలుపు ఉంటుంది. రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖవారు ప్రమాదాలు అరికట్టడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఈ మూలమలుపు ప్రమాధకరంగా ఉండటం వలన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అ ప్రదేశంలో జనజీవనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని అరికట్టాలని అక్కడి ప్రజలు దీనికి సంబంధించిన అధికారులు చొరవ తీసుకొని ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటున్నారు.