Thursday, March 12, 2026

జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రతిభ

  • జాతీయ స్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపిక
  • ఆకట్టుకున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై ఉపాధ్యాయుని ప్రజెంటేషన్
  • జాతీయ స్థాయిలో 25వేల రూపాయల బహుమతికి ఎంపిక

నేటిసాక్షి ప్రతినిధి, చందుర్తి (సతీష్):
చందుర్తి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మేడికాల అంజయ్య, కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపి2020) పై రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఉపాధ్యాయులకు 21 రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అంజయ్య జాతీయ స్థాయిలో సిసిఆర్టి డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ కుమార్ చేతులమీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. డిసెంబర్ 26 నుండి జనవరి 15 వరకు 21 రోజుల పాటు కొనసాగిన జాతీయ స్థాయి శిక్షణకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరుగురు ఉపాధ్యాయులకు అవకాశం లభించగా వారిలో ఉపాధ్యాయుడు అంజయ్యకు చోటు లభించింది. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ పూర్లోని సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్టీ)లో శిక్షణలో భాగంగా, నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలు, అమలు తీరుపై నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. ఈ శిక్షణకు దేశంలోని వివిధ రాష్ట్రా లకు చెందిన 78 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ఆకట్టుకున్న వీడియో ప్రజెంటేషన్ :
ఆంజయ్య రూపోందించిన వీడియో ప్రజెంటేషన్, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం, రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు, రాష్ట్రంలో సాధించిన ప్రగతి, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు,మన రాష్ట్ర పండుగలైన బతుకమ్మ. బోనాల వేడుక ప్రాముఖ్యత, తెలంగాణ హెరిటేజ్ వంటి పలు అంశాలను జాతీయ స్థాయి ప్రతినిధుల ముందు ౩౦అంశాల పై, 30 నిమిషాల నిడివి గల పిపిటి, వీడియో ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. బతుకమ్మ ఆట, పాటలను, తెలంగాణ జానపదాలను తెలంగాణ గీతం, తెలంగాణ చిహ్నలు, రాష్ట్ర సరిహద్దు భాష సంస్కృతి సంప్రదాయాలు ప్రదర్శించి, తెలంగాణ గొప్పదనాన్ని చాటిచెప్పిన రాష్ట్ర ఆంజయ్యను సీసీఆర్టీ డైరెక్టర్ అభినందించారు.

అంజయ్యకు సిక్కిం ప్రతినిధుల సన్మానం:
ప్రజంటేషన్ రూపొందించడం, ప్రదర్శించడం, శిక్షణలో చురుకుగా పాల్గొనడం పై అంజయ్య అవగాహన కల్పించగా అంజయ్యను అభినందిస్తు సిక్కిం ప్రతినిధులు, తమ సంప్రదాయ విధానంలో సన్మానించి గౌరవించారు.

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిన ఉపాధ్యాయులు:
అంజయ్యతో పాటు మన రాష్ట్రం నుండి పాల్గొన్న ఉపాధ్యాయ బృందం,వివిధ రాష్ట్రాల నుండి హాజరైన ప్రతినిధుల ముందు తెలంగాణ సాంప్రదాయ వస్త్రదారణతో , తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ ఆట, బోనాలు, పోతురాజు, తెలంగాణ ఉద్యమ పాటలతో నార్త్ ఇండియా ప్రతినిధులను అబ్బుర పరిచారు.

జాతీయ స్థాయి ప్రతిభ పురస్కారానికి ఎంపిక :
ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అంజయ్య అందిస్తున్న ఉత్తమ సేనలను గుర్తించి, వోడాఫోన్ ఐడియా ఫౌండేషన్ జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుల ప్రతిభను, ఉత్తమ సేవలను ప్రోత్సహించేందుకు అందించే ఇరవై ఐదు వేల రూపాయల ఉపాధ్యాయ స్కాలర్షిప్ ను ఈ ఏడాది అంజయ్య అందుకున్నాడు. ఈ సందర్భంగా అంజయ్యను పలువురు అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నాయకులు అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News