Wednesday, March 18, 2026

కిట్స్ వరంగల్ లో జాతీయ స్థాయి స్టూడెంట్ కల్చరల్ కార్నివాల్ “సంస్కృతి’25” వైభవోత్సవ వేడుక

  • సాంస్కృతిక మరియు సాంప్రదాయ బీట్‌లు
  • మీ జీవితంలో క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి వెల్లడి

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఫిబ్రవరి 8, 2025న ప్లేఫీల్డ్స్ కిట్స్ వరంగల్ క్యాంపస్‌ లో సాంస్కృతిక కార్నివాల్ “సంస్కృతి’25” వైభవోత్సవ వేడుక జరిగింది. మ్యూజిక్ డ్యాన్స్ & ఫైన్ ఆర్ట్స్ (యం డి యఫ్) క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి తెలిపారు. ఇది 2025 ఫిబ్రవరి7-8 లో రెండు రోజుల పాటు విజయ వంతంగా నిర్వహించబడింది.

ఈ సందర్భంగా చీఫ్ పాట్రన్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్. కె. అశోక రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా మా సంస్థలో విభిన్న సాంస్కృతిక మరియు వినూత్న సాంప్ర దాయ కార్యక్రమాలు జరిగాయి. హోలిస్టిక్ డెవలప్మెంట్ విధానం విద్యార్థుల మధ్య నైతికతను పెంపొందించడంతో విద్యార్థులను నిమగ్నం చేయడం ద్వారా వ్యక్తిగత మరియు సమిష్టి బాధ్యతను ప్రోత్సహిస్తుంది. ఈ రెండు రోజుల పాటు దాండియా, స్ట్రీట్ ఆర్ట్ ఫెయిర్, లైవ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్, గెస్సింగ్ గేమ్, ట్రెడిషనల్ బీట్స్, ట్రెజర్ హంట్, సెల్ఫీ కాంటెస్ట్, హుక్ స్టెప్ ఛాలెంజ్, ఫోటో బూత్ డోమ్, డంబ్ చరేడ్స్ మరియు అంతాక్షరి, ఫేస్ పెయింటింగ్ డబ్‌స్మాష్, విద్యార్థుల ప్రదర్శనలు మరియు డి జె షోలు యువకులను ఉర్రూతలూగించాయి. చివరికి అది నైపుణ్యానికి దారి తీస్తుంది, సాంస్కృతిక మరియు సాంప్రదాయ బీట్‌లు మీ జీవితంలో క్రమ శిక్షణకు ప్రతీకగా నిలుస్తాయని మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆయన ముగించారు.
ఈ సందర్భంగా చైర్‌ పర్సన్ సంస్కృతి’ 25 & డీన్ విద్యార్థి వ్యవహారాలు, ప్రొఫెసర్ ఎం. శ్రీలత మాట్లాడుతూ విద్యార్థులు నృత్యం, నాటకం, సంగీతం మరియు గానం రూపంలో తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా యువ మనస్సుల సృజనాత్మకతకు సాక్షులుగా నిలిచారు. కన్ఫెషన్స్ వంటి 20కి పైగా స్పాట్ ఈవెంట్‌లు వివిధ ఐదు వేదికలయిన, సివిల్ సెమినార్ హాల్, న్యూ సెమినార్ హాల్, సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్, మెక్ సెమినార్ హాల్ మరియు ఆడిటోరియంలో జరిగాయి. యువ మనస్సులను తేలికపరచడానికి వినోదం, ఉత్సాహం మరియు అభిరుచితో అనుసంధానం చేయడానికి ఇది ఒక గొప్ప నిర్మాణాత్మక వేదిక గా నిలిచింది. విభిన్న కోణాల్లో సంస్కృతిక కార్య కలాపాలు విద్యార్థి సంఘం యొక్క సమగ్ర అభివృద్ధికి దారి తీస్తాయని తెలిపి ముగించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఫార్మర్ ఎంపీ, కిట్స్ వరంగల్ చైర్మన్‌, కెప్టెన్‌ వి. లక్ష్మీకాంతరావు, కిట్స్ వరంగల్ కోశాధికారి పి. నారాయణరెడ్డి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే & కిట్స్‌డబ్ల్యు అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించడం వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల విభాగాధిపతులను, విద్యార్థిని విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్‌ పర్సన్ సంస్కృతి’25 & డీన్ విద్యార్థి వ్యవహారాలు, ప్రొఫెసర్ ఎం. శ్రీలత, సంస్కృతి’25 కన్వీనర్ & అసోసియేట్ డీన్ విద్యార్థి వ్యవహారాలు & ఈ ఈ ఈ అసోసియేట్ ప్రొఫెసర్, యం. నర్సింహారావు, వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల విభాగాధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & ఫి అర్ ఓ, డాక్టర్ డి. ప్రభాకరా చారి, పబ్లిక్ రిలేషన్స్ యమ్ డి యఫ్ క్లబ్, పి. రక్షిత్, యమ్ డి యఫ్ క్లబ్ ప్రధాన కార్యదర్శి హెచ్, శ్రీగౌరీ జాహ్నవి, మరియు స్టూడెంట్ కోఆర్డినేటర్ సంస్కృతి’25, యమ్. సాకేత్, వివిధ క్లబ్‌ల ప్రధాన కార్యదర్శులు & సంస్కృతి’25 విద్యార్థి ప్రతినిధులు, కిరిల్ ప్రవర్ష్, ఆసిఫ్ అబూబకర్, నయన, మరియం యాస్మీన్, సుఫియాన్, వనలక్ష్మి, అనిరుధ్ , రియాన్, శశి, రాహుల్, రిషిత్, స్నేహ, స్నేహాంకిత, పాటు డిస్కో క్లబ్, పి & యమ్ క్లబ్ , సాక్ సభ్యులు, విద్యార్ది ప్రతినిధులు, అధ్యాపక సభ్యులు, సిబ్బంది మరియు 2000 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News