Sunday, March 29, 2026

రేపే జాతీయ లోక్ అదాలత్

  • 8 వ తేదీ శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేద్దాం.
  • జాతీయ లోక్ అదాలత్ లో కక్షదారులు ఉచితంగా సత్వర సమన్యాయం పొందవచ్చు :
  • జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్.భారతి.

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 వ తేదీ శనివారం జరగనున్నా జాతీయ లోక్ అదాలత్ లో కక్షదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్.భారతి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యాలయం నందు శనివారం జిల్లాలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ గౌరవ కేంద్ర న్యాయ సేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ. బీమారావ్ గారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది తెలిపారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 32 బెంచ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.1997 సంవత్సరం నుంచి జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేయడం జరుగుతుందన్నారు.కోర్టులలో లక్షలో కేసులు పెండింగ్ లో ఉన్నాయని,ప్రతి మూడు నెలలకు ఒక్కసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు 10 నుండి 20 శాతం కేసులు పరిష్కరం అవుతున్నాయని తెలిపారు. రాజి మార్గం లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షదారు లకు సమయము తో పాటుగా, ధనము అదా అవుతుందన్నారు. లోక్ అదాలత్ లో ఇచ్చిన తీర్పు అంతిమ తీర్పుని దాని పై ఆపిల్ కూడా ఉండదన్నారు.10 నుంచి 15 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ పెండింగ్ లో ఉన్న కేసులను కక్షదారులు ఇద్దరు స్నేహపూర్వకంగా రాజీకి వచ్చిన కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. క్రిమినల్,సివిల్ కేసులతో పాటుగా అన్ని రకాల రాజి పడదగ్గ మోటార్ వాహనాల కేసులు,చెక్ బౌన్స్ కేసులు,ఇపి, డివిసి,యంసి, బ్యాంక్ కేసులు,బియస్ఎన్ఎల్,పియల్పి, మొదలగు కేసులను రాజి చేసుకోవచ్చు అన్నారు.గతం లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 8027 వివిధ రకాల కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ముందస్తు ఫ్రీ లోక్ అదాలత్ లో క్రిమినల్,సివిల్ 300 కేసులను పరిష్కరం చేయడం జరిగిందన్నారు. కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసులను రాజీ చేసుకోవాలని కక్షదారుల కు చూచించారు. శనివారం నిర్వహించే లోక్ అదాలత్ లో న్యాయ మూర్తులు,న్యాయ వాదులు,రెవిన్యూ, పోలీసు, బ్యాంకు అధికారులు ,చిట్ ఫండ్ కంపిణి లు,భీమ సంస్థ ప్రతినిధులు, కక్షదారులు పాల్గొని విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉండేలా సహకరించాలన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News