- వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలి
- సిఐ అశోక్ రెడ్డి
నేటి సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జక్కుల సందీప్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలు పురస్కరించుకొని భద్రాది జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు అశ్వాపురం పోలీస్ లు ప్రధాన రహదారి వెంట ఆటో లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వాహన దారుడు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనా కలిగి ఉండాలని, సేఫ్టీ తో ప్రయాణించాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ఎవ్వరికీ ప్రమాదం జరుగదన్నారు. వాహన దారులు మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేయవద్దన్నారు. రోడ్డు పై పార్కింగ్ చేసేటప్పుడు కూడా ట్రాఫిక్ జాం కాకుండా మీ వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.ప్రతి వాహన దారుడు తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.మితిమీరిన వేగం ప్రమాదకరమన్నారు.మీ పై ఆధార పడ్డ మీ కుటుంబ సభ్యులను గుర్తుంచుకొని వాహనాలు నడపాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎస్ ఐ. రవుఫ్, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్ లు, వివిధ వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.





