Wednesday, March 25, 2026

జాతీయ సైన్స్ దినోత్సవం

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
జిల్లా పరిషత్ బాలికల పాఠశాల లో జాతీయ సైన్స్ దినోత్సవం 2025 ఫిబ్రవరి 28న నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వ్యాసరచన సైన్స్ ఫెయిర్ క్విజ్ ఉపన్యాస పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు సృజనాత్మకంగా సైన్స్ ఫెయిర్ లో ఎగ్జిక్యూట్స్ తయారు చేసి ప్రదర్శించారు. 10వ తరగతి పదవ తరగతి విద్యార్థి బి. కార్తికేయ తయారు చేసిన Obstacle avoiding Robotic Car ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజాభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని శాస్త్రీయ ఆలోచనలు పరిశీలనా శక్తిని పెంపొందించుకోవాలని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు బి. తిరుమల సైన్స్ ఉపాధ్యాయులు ఎం మాధవి, పీ.శ్రావణి, టి విజయ, పి శ్రావణి, బి. మారుతి ప్రసాద్ మరియు మిగిలిన ఉపాధ్యాయులు ఆసియా, రోజా రాణి, అర్చన, ఈశ్వర్ రెడ్డి, శ్రీలత, సంపత్ కుమార్, శ్రీనివాస్, రాములు జమున రాణి, శోభారాణి సదానందం మరియు విద్యార్థులు సైన్స్ డే ను విజయవంతం చేశారు. సైన్స్ డే కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ 1లోకేష్ అన్న అవినాష్ తయారుచేసిన హోం సెక్యూరిటీ సిస్టం న్యూటన్ క్రాడిల్ ఎండి రేష్మ రైన్ వాటర్ హార్వెస్టింగ్ బి కౌశిక్ సోలార్ కూలర్ ఎం యశ్వంత్ చెక్ యువర్ కాన్సన్ట్రేషన్ కార్తిక్ యాంటీగ్రేవిటి పెన్సిల్ ప్రదర్శించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News