
నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామం లో ప్రభుత్వ పాఠశాలలో సర్ సి.వి రామన్ పుట్టినరోజు సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం పరిశోధన నేర్చుకోవాలని అలవాటును విద్యార్థులు కలిగి ఉండాలని మాట్లాడుతూ.. సైన్స్ అంటే నాలెడ్జ్ అని, సైన్స్ లేనిదే ఈ సృష్టి లేదన్నారు. ప్రతి ఒక్కరు వారి జీవితంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకునేలా ఎదగాలని, ప్రతిదాన్ని చూసి తమలో తామే ప్రశ్నించుకునే తత్వాన్నిపెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే క్విజ్ అలాగే పోటీలు, శాస్త్రాన్ని ప్రోత్సహించేలా క్విజ్, ఎస్సే రైటింగ్, అలాగే డ్రాయింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల శాస్త్ర పరిశోధనలను మెచ్చుకుని ఉత్తమ ప్రాజెక్ట్‌లను ఎంపిక చేసి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశోధనా దృష్టిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. శాస్త్రం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం విద్యార్థుల ముఖ్య బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలకి నిర్వాహకులందరికీ స్కూల్ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపారు.




