Saturday, March 14, 2026

ఘనంగా నేతజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి: చందుర్తి మండల మరిగడ్డ గ్రామంలో బీజేపీ గ్రామశాఖ ఆధ్వర్యంలో బొంబోతుల ప్రశాంత్, రాంరెడ్డి వెంకట్ రెడ్డి లు స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో సుభాష్ చంద్రబోస్ కృషి మరువలేనిదని, మన దేశానికి అజాద్ హిందూఫౌస్ అనే సైనిక దలాన్ని ఏర్పాటుచేసి బ్రిటీషర్ల గుండెల్లో భయాన్ని నింపిన వీరుడు చంద్రబోస్ అని, నేటి తరానికి అయన జీవిత విశేషాలను చెప్పాల్సిన భాద్యత మనందరిదీ అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కౌన్సిల్ సభ్యులు పొంచేట్టి రాకేష్, నాయకులు చింతకుంట గంగాధర్,పుప్పాల మోహన్ రెడ్డి, అయోధ్య పర్శరాములు, చింతకుంట సాగర్,బోడిగే శంకరయ్య (ఎల్ ఐ సి), దారం రాజశేఖర్ రెడ్డి, మారుపాక సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News