- – అమలుకు సంసిద్ధంగా ఉండాలి
- – కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి
నేటి సాక్షి, కరీంనగర్: జూల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన చట్టాలను అమలు కానున్నాయని, వాటిని అమలు పర్చేందుకు సంసిద్ధంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. గురువారం రాష్ర్టవ్యాప్తంగా సీపీలు, ఎస్పీలు, అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన చట్టాల అమలుపై పలు కీలక అంశాలను చర్చించారు.
ఐపీసీ1860కి బదులుగా ‘భారతీయ న్యాయ సంహిత 2023’, సీఆర్పీసీ 1973కి బదులుగా ‘భారతీయ నాగరిక్ సురక్షసంహిత 2023’, ఇండియన్ ఎవిడన్స్ యాక్ట్ 1872కు బదులుగా ‘భారతీయ సాక్ష్య అధినియం 2023’ అమలులోకి రానున్నాయని డీజీపీ తెలిపారు. వీసీ అనంతరం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని కాన్ఫెరెన్స్ హాల్లో సీపీ పలు అంశాలపై అధికారులతో చర్చించారు. జూలై నెల నుంచి జరగబోయే నేరాలకు మారిన చట్టాలకు అనుగుణంగా కేసులు నమోదు చేయాలని సూచించారు.
అన్నీ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు విధిగా నూతన చట్టాలను అమలు చేయాలని చెప్పారు. అమలు చేయనున్న కొత్త చట్టాలపై ఏర్పడే సందేహాలను నివృత్తి చేసుకుంటూ సరైన సెక్షన్లను ప్రయోగించాలని పేర్కొన్నారు. నేరస్థులు తప్పించుకునేందుకు వీలు లేకుండా భాదితులకు న్యాయం జరిగేలా పకడ్బందీగా చట్టాలు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, ఏసీపీలు శ్రీనివాస్, నరేందర్, శ్రీనివాస్‌జీ, విజయకుమార్, కాశయ్యతో పాటు జిల్లాలోని అన్ని విభాగాల ఇన్స్పెక్టర్లు, ఆర్ఐ వెల్ఫేర్ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.