Monday, March 23, 2026

పరీక్షల సన్నద్ధతపై న్యూ ఏజ్ ఫౌండేషన్ అవగాహణ శిక్షణా తరగతులు

నేటి సాక్షి, బెజ్జంకి: న్యూ ఏజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్, ఎల్లంపల్లి లో శనివారం విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై అవగాహణ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ బోయిన్ సంపత్ మరియు సైకాలజిస్ట్ రమాదేవి విద్యార్థులకు ప్రేరణాత్మకంగా మార్గదర్శనం చేశారు. పరీక్షల్లో ఒత్తిడిని ఎలా జయించాలి, మనస్సును ఏ విధంగా నియంత్రించుకోవాలి, తక్కువ సమయంలో ఎలా సమర్థంగా సిద్ధమవ్వాలి వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను ఎలా సాధించాలో వివరించారు. తల్లిదండ్రులను గౌరవించడం, ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో నడుచుకోవడం వంటి జీవితపరమైన విలువల గురించి సూచనలు అందించారు.ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ న్యూ ఏజ్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శిరీన్, కేలిత డా. బాబు, చంటి బాబు, సంజీవ్, రమేష్,శారద,లక్ష్మీ, శరత్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News