నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మెల్లి శంకర్ మంగళవారం పలువురికి నియామక పత్రాలు అందజేశారు.జాతీయ బిసి సంక్షేమ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శిగా మర్రి నందకిషోర్,మండల అధ్యక్షులుగా చింతకుంట దేవేందర్ లకు నియామక పత్రాలు అందజేశారు.నూతనంగా నియమకైనా వారిని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మల శంకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల వెంకటేశ్వర్లు, మండల, డివిజన్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, పూదారి సుధాకర్ గౌడ్, చర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గంగోని సురేష్, అంజయ్య, భాష నర్సింగారావు తదితరులు పాల్గొన్నారు.




