Sunday, March 15, 2026

కాజీపేట ఆవరణలో నూతన బస్టాండ్ ఏర్పాటు

  • నూతన బస్టాండ్ ఏర్పాటుకు అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కాజీపేట ఆవరణలో నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఏడిఆర్ఎం గోపాల్ లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య స్థలాన్ని పరిశీలించారు. ముందుగా అధికారులతో కలిసి మ్యాప్ ద్వారా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ..వరంగల్‌ జిల్లా సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్‌ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలియజేశారు. కాజీపేట నూతన బస్టాండ్ ఏర్పాటు కోసం అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించామని వెల్లడించారు. ఏడాదిలోపు కాజీపేట నూతన బస్టాండును ప్రారంభించకపోతున్నామని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా కాజీపేట బస్టాండ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. విస్తృతమైన రైల్వే కనెక్షన్‌లలో కీలకమైన జంక్షన్ కాజీపేట అని పేర్కొన్నారు. బస్టాండు ఏర్పాటుతో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందించడం జరుగుతుందని వెల్లడించారు. పార్లమెంట్ లో కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది నాయకులు, ప్రజలు కాజీపేట బస్ స్టేషన్ నిర్మాణం కావాలని పోరాటాలు చేశారు, గతంలో నేను కూడా ధర్నాలు రాస్తారోకో చేసామని గుర్తు చేశారు. కాజీపేట బస్ స్టాండ్ ఏర్పాటు, కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు కోసం ఎంపీ, మేయర్, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి రైల్వే అధికారులను కలవడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో రైల్వే అధికారులు మొదటి అడుగు వేశారని తెలిపారు. రానున్న అతికొద్ది రోజుల్లోనే రైల్వే బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి అవుతుందని, తదనంతరం కాజీపేట బస్ స్టేషన్ నిర్మాణానికి అనుమతులు వస్తాయని రైల్వే అధికారులు సహకారాలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కాజీపేట బస్ స్టేషన్ పేరిట్ ఎందరో నాయకులు తమ సొంత లాభాలకు వాడుకున్నారని, నా కల బస్ స్టేషన్ నిర్మించడమని అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాజీపేట నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, త్వరలో కాజీపేట లో డిగ్రీ కళాశాల, మెరుగైన వైద్యం కోసం దవాఖాన ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కుడి వైపున కానీ ఎడమ వైపున కానీ బస్ స్టాండ్ నిర్మాణానికి అనువైన స్థలాలను ఉన్నాయని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య రైల్వే అధికారు లు చూపించిన మ్యాప్ న పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ త్వరగా ఫైల్ తయారు చేయాలని అధికారు లకు సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News