Thursday, March 12, 2026

అర్హులకు నూతన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి

30వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు

నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 30 వ వార్డు విద్యానగర్ – గాంధీనగర్ లోని కాలనీలో నివసించే అర్హులైన ప్రతి ఒక్కరికి, నిరుపేదలకు నూతన రేషన్ కార్డులు, అలాగే కాలనీలో ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు, ఏమీ లేని ఇల్లు కిరాయి ఉండే నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టించి గాని, లేక గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుజురాబాద్ ప్రాంతంలోని సిర్సపల్లి రోడ్డు వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూములు, ఖాళీ ఇంటి స్థలాలు కేటాయించాలని 30 వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో భాగంగా ప్రజా పాలన కార్యక్రమంలో ఇంటి ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రూపొందించిందని, దీనితో కొంతమంది ఇంటి ఖాళీ స్థలం ఉన్నవారు దరఖాస్తులు చేసుకోగా ఇంటి ఖాళీ స్థలం లేని నిరుపేదలు దరఖాస్తులోని ఇందిరమ్మ ఇల్లు పథకం షెడ్యూల్ కాలంలో మార్క్ పెట్టలేదు. దీనితో ఇందిరమ్మ ఇల్లు సర్వే చేసే అధికారులు మార్కు చేయని నిరుపేదల ఇండ్లలో సర్వే చేయలేదని, ఇంటి ఖాళి స్థలం లేని నిరుపేదలు దిగులుతో ఉన్నారని అన్నారు. కాబట్టి ఖాళీ స్థలం లేని నిరుపేదలకు మొదటి ప్రాధాన్యమిచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి గాని, లేదా గతంలో కట్టిన డబుల్ బెడ్ రూములు కేటాయించిన తర్వాతనే మిగతా ఇంటి ఖాళీ స్థలం ఉన్న వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని, అలాగే కుల గణన సర్వే ద్వారా నూతన రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం తెలిపినప్పటికి కుల గణన సర్వే సమయంలో కొంతమంది ఆయా ప్రాంతాలలో లేక ఇతర పనుల నిమిత్తం వారు ఇతర ప్రదేశాలకు పోవడం ద్వారా కొంత మంది సర్వేలో పాల్గొనలేకపోయారని అన్నారు. కాబట్టి సర్వేలో పాల్గొనని వారిని కూడా మళ్లీ సర్వే చేసి అర్హులైన వారందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా మంత్రులను, ప్రజా ప్రతినిధులను, అధికారులను అభ్యర్థించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News