నేటి సాక్షి, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాలయం (ఎంపీడీఓ) లో విశ్వభారతి హైస్కూల్ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎంపీడీవో గుండె బాబు , తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మౌటం కుమారస్వామి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పెర్క రమాకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మండల ప్రజలు మరియు విద్యార్థిని విద్యార్థులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ భారతి హై స్కూల్ కరస్పాండెంట్ ఇంజపూరి మధుబాబు, ప్రిన్సిపల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

