పటాన్‌చెరులోని మకుట అరుణ ఆర్కేడ్ కాంప్లెక్స్‌లో

నేటి సాక్షి పటాన్చెరు నియోజకవర్గం అక్టోబర్ 5

పటాన్‌చెరులోని మకుట అరుణ ఆర్కేడ్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వరాహి బాంకెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ఎండీర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు పటాన్‌చెరు పట్టణ ప్రముఖులతో కలిసి పాల్గొని, వరాహి బాంకెట్ హాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా ప్రారంభమైన ఈ బాంకెట్ హాల్ ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చి, వివిధ శుభకార్యాలకు చక్కని వేదికగా నిలవాలని, నిర్వాహకులకు రాబోయే రోజుల్లో మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జైపాల్ మాజీ కార్పొరేటర్ సఫాన్ దేవ్ ప్రకాష్ అమరేందర్, మతిన్ సోమశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.వరాహి బాంకెట్ హాల్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు