ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి

నేటి సాక్షి సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 05

ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలి – అధికారులకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాలు సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధిప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి చట్టపరమైన పరిష్కారం అందించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు.ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన జిల్లా ఎస్పీ, వారి సమస్యలను ఓపికగా విని ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో తమ సమస్యకు పరిష్కారం లభించని పక్షంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి, చట్టపరమైన పరిష్కారం మరియు సత్వర న్యాయం పొందేందుకు ప్రజావాణి కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తుందని ఎస్పీ తెలిపారు.