నేటి సాక్షి చిలుకూరు (మొక్క వెంకన్న గౌడ్)
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో : బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దొడ్డ సురేష్ బాబు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు సురేష్ బాబు సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి దొడ్డ సురేష్ బాబు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, అందరికీ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.
సురేష్ బాబు ఆశయాలు, సేవా స్ఫూర్తిని కొనసాగించడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి అని పలువురు పేర్కొన్నారు. ఆయన లేని లోటు పార్టీకి, అభిమానులకు ఎప్పటికీ తీరనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, అలసగాని జనార్ధన్ ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య బట్టు శివాజీ అంబాల వెంకటి షేక్ పాషా లింగరాజు మాధవరపు శీను నరసయ్య బెల్లంకొండ సైదులు రామయ్య లేకపోతే శీను షాకిర్ పాషా కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.