హనుమకొండ, అక్టోబర్ 11
నేటి సాక్షి (సందెల రాజు)
ఎల్‌నినో ప్రభావం, వ్యవసా యానికి సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం 12 గంటలనుంచి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వ హించే ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమ సమయాన్ని ఉద యం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వర కు మాత్రమే పరిమితం చేసి నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ను ప్రసా రం చేయనున్నట్లు పేర్కొన్నా రు. ఈ కార్యక్రమానికిమండల అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్ర త్యేక అధికారులు తప్పనిస రిగా హాజరుకావాలని సూచిం చారు. ప్రజావాణి సమయ మార్పును ప్రజలు గమనించి, తమ ఫిర్యాదులు, వినతుల ను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట ల లోపు సమర్పించాలని కలె క్టర్ కోరారు.