నేటి సాక్షి,అందోల్-జోగిపేట :-
అందోల్ గ్రామంలోని క్యాంపు కార్యాలయం ఎదురుగా నూతనంగా MGR ఫంక్షన్ హాల్ ప్రారంభమైంది. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అందుబాటు ధరల్లోనే అన్ని సకల సౌకర్యాలతో ఈ ఫంక్షన్ హాల్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఓమర్ ఫరూక్, అక్బర్ భాయ్, మెహతాబ్ ఖలీల్ మాట్లాడుతూ, “ప్రతి కుటుంబం తమ శుభకార్యాలను ఆర్థిక భారం లేకుండా ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో MGR ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించాం. వివాహాలు, నిశ్చితార్థాలు, పుట్టినరోజులు, శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అన్ని వేడుకలకు తగిన సదుపాయాలతో, పరిశుభ్రమైన వాతావరణంలో, తక్కువ ధరల్లో సేవలు అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.
ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు హాజరై నిర్వాహకులను అభినందించారు.
ఈ ఫంక్షన్ హాల్ అందోల్ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.