ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా

అక్టోబర్ 13 నేటి సాక్షి నకిరేకల్ రామగిరి వెంకటేశ్వర్లు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని కూడా పెండింగ్‌లో పెట్టకుండా ప్రతి పథకాన్ని అమలు చేశారు,వ్యవసాయ రంగానికి నీరు, కరెంట్ ఇవ్వకుండా, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతోందన్నారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ మౌలిక వసతులు వంటి రంగాల్లో పేద వర్గాలకు ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ధైర్యం కల్పించారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఓటరు వినియోగించుకునేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు.డిగ్రీ పూర్తి చేసినవారు, సీనియర్లు, ఉద్యోగస్తులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వివిధ రంగాల ఉద్యోగుల ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లను నమోదు చేసే కార్యక్రమం చేయాలని కోరారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి, కేసీఆర్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.గత ఎనిమిది మాసాలుగా మూసీ గేట్లు రిపేర్ చేయకపోవడం నీటిని వృధాగా కిందకి వదలడం జరుగుతోంది.అవసరం ఉన్న కాలంలో నీరు ఇవ్వకుండా ఎక్కువ మొత్తం వదిలి మూసీ ప్రాజెక్ట్‌ను ఖాళీ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూడో పంటకు ఎండాకాలంలో నీరు వచ్చే విధంగా ఉండాలని రైతులు అనేక సందర్భాల్లో అధికారులకు, కలెక్టర్లకు ఫోన్ చేసి నీరు సరిపడ వదలాలని కోరారు.గతంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఎండాకాలంలో కూడా చెరువులు నింపామని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే వైఖరి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మారం వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.