మెదక్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట

హన్మకొండ అక్టోబర్ 13
నేటి సాక్షి (సందెల రాజు)

మెదక్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధురా లు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రజక సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేపల్లి రాజు (మైకేల్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహనీయుల విగ్ర హాలను ధ్వంసం చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు.
మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలంగాణ ఆత్మ గౌరవంపై దాడి అని అన్నారు. రాష్ట్రం లో మహనీయుల విగ్రహాలకే రక్షణ కల్పించలేకపోతే ప్రజల ప్రాణాలకు ఎలా భద్రత కల్పి స్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. ఈ ఘటన హోంశాఖ వైఫ ల్యానికి నిదర్శనమని విమ ర్శించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులతో పాటు వారికి సహకరించిన వారిని కూడా గుర్తించి కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేశారు. ఘటనపై ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందిం చి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని కోరారు. లేనిపక్షంలో రజకుల ఆగ్రహా న్ని చవి చూడాల్సివస్తుందని హెచ్చరించారు.మహనీయుల విగ్రహాలపై దాడులను సహిం చేది లేదని, ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేపల్లి రాజు (మైకేల్) స్పష్టం చేశారు.