[
నేటి సాక్షి న్యూస్ అక్టోబర్ 13
మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు సమీపంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన మహనీయురాలి విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ చరిత్రను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అలాంటి మహనీయురాలి విగ్రహాన్ని ధ్వంసం చేయడం సమాజం తలదించుకోవాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.విగ్రహం సమీపంలో నాలుగు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, అలాంటి కెమెరాలు పనిచేయకపోతే నేర పరిశోధనకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు.
ఘటన జరిగిన తర్వాత కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించడం కాకుండా ముందుగానే వాటి పనితీరును పరిశీలించాలని సూచించారు. ఈ విషయంలో పోలీసు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.చాకలి ఐలమ్మ విగ్రహాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాలకు తగిన భద్రత కల్పించడంతో పాటు, పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ విగ్రహ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
[13/10, 8:47 pm] Venkateshwarlu Nakrekal: మూసి పరివాహక ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు.......!!
అక్టోబర్ 13 నేటి సాక్షి కేతేపల్లి రామగిరి వెంకటేశ్వర్లు
కేతేపల్లి మండలంలోని మూసీ పరివాహక ప్రాంత గ్రామాల్లో నీరు అందక ఎండిపోతున్న వరి పొలాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టు డ్యామ్ వద్ద రైతులకు నీటి విడుదలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో రైతులకు ఈ విడత పంటను కాపాడు కుంటూ రెండో పంటకు సైతం సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. భీమారం, తదితర గ్రామాల రైతుల విజ్ఞప్తుల మేరకు సాగునీటిని విడుదల చేస్తున్నామని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల విమర్శలు
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మూసీ ప్రాజెక్టు నీటి విడుదల, పూడికతీత పనులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న మూసీ ప్రాజెక్టు పూడికతీత పనులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు.రైతులు చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యలను పట్టించుకోవద్దని, సాగునీటి విడుదలను వ్యతిరేకించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజార్ల శంభయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులమాధవరెడ్డి, పేర్కొన్నారు. రైతులకు నీరుఅందించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నకిరేకల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కంప సాటి శ్రీను, ఇనుపాముల గ్రామ సర్పంచ్ బొజ్జ సుందర్, స్థానిక రైతులు పాల్గొన్నారు.