ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్

ఉప్పల్,అక్టోబర్ 14,(నేటి సాక్షి ):

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కృషితో రామంతాపూర్‌లోని నేతాజీ నగర్, రాజేంద్రనగర్ శ్మశాన వాటికల అభివృద్ధి కోసం రూ.72 లక్షల నిధులు మంజూరయ్యాయి.
మంగళవారం రామంతాపూర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పరమేశ్వర్ రెడ్డి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ని కలిసి శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.
అభ్యర్థ న పై సానుకూలంగా స్పందించిన కమిషనర్ వెంటనే రూ.72 లక్షల నిధులను మంజూరు చేయడంతో పాటు, టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నే రామంతాపూర్ నేతాజీనగర్ రాజేంద్ర నగర్ శ్మశాన వాటిక ల్లో అభివృద్ధి పనులు జరిగాయని గత 10 సంవత్సరాలు గా ఈ స్మశాన వాటికలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు,ప్రస్తుతం పూర్తి స్థాయి అభివృద్ధి కోసం ఎంఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి రూ.72 లక్షల నిధులు మంజూరు చేయించామని తెలిపారు.ఈ సందర్భం గా రామంతాపూర్ కాంగ్రెస్ నాయకులు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి కి, పరమేశ్వర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ అధ్యక్షుడు సందీప్, రఫిక్, వల్లపు శ్రీకాంత్ యాదవ్, ఉదయ్ భాస్కర్ గంగపుత్ర, పూస సత్తి అన్న, షాగా శ్రీధర్, సచిన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.