నేటి సాక్షి :మల్లాపూర్ (రాజశేఖర్ బక్కూరి)
మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఊరుకు నలువైపులా రోడ్లు అధ్వానంగా మారి అడుగడుగునా గుంతల మయం అయ్యాయి. దీనివలన వాహనదారులకు, కాలినడకన వెళ్లే వాళ్లకు అసౌకర్యంగా మారింది. గాంధీ విగ్రహం దగ్గర నుండి గ్రామపంచాయతీ వరకు ఉన్న రోడ్డు మొన్నటి వానలకు రోడ్డు మరింతగా పాడైపోయింది ద్విచక్ర వాహనాలు నడిపే వారికి చాలా కష్టతరంగా మారి వాహనాలు పాడడంతో పాటు నడుమునొప్పి బారిన చాలామంది పడ్డారు.
అంతేకాకుండా రాత్రి వేళలు చాలామంది గుంతలలో పడకుండా తప్పించే క్రమంలో అద్భుతప్పి కింద పడిపోయిన వారు ఎక్కువనే ఉన్నారు. పలుమార్లు ఇప్పటివరకు ఉన్నది అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కూడా ఏమాత్రం కూడా చలనం లేకుండా పోయింది. దయచేసి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రోడ్లు బాగు చేయించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.