నకిరేకల్ నియోజకవర్గ పర్యటనలో

అక్టోబర్ 13 నేటి సాక్షి కేతేపల్లి


నకిరేకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ బాకీ నరసింహ మాట్లాడుతూ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హులైన పట్టభద్రులు ప్రతి ఒక్కరూ తమ ఓటరు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నకిరేకంటి మొగులయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వనం అంజయ్య, సీనియర్ నాయకులు పాల్వాయి భాస్కర్ రావు, మాస శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షులు మెడబోయిన శ్రీనివాస్, పీక వెంకన్న, మధుకర్ రెడ్డి, కూరెల్లి శ్రీను, ఒడ్డవోని రామలింగం, పాలకూరి రమేష్, ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి చినేని జాని, చింతపల్లి వెంకన్న, ఎస్సీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు పొలిమేర నర్సింహ,రావుల శ్రీను, నల్లగొండ లింగయ్య, ఉపేందర్, తిరుమలేశ్, భాస్కర్, నరసింహ,శివ, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.