నేటి సాక్షి జూపాడుబంగ్లా(అక్టోబర్-13):
-జూపాడుబంగ్లా మండలంలోని, కనకయ్యకొట్టాల గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు దొడ్డ సుధాకర్ చౌదరి తన సొంత ఖర్చుతో రంగులు వేయించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల మొత్తం అందంగా కనిపించేలా రంగులు వేయించేందుకు ఆయన మొత్తం రూ.40,000 ఖర్చు చేశారు.
పాఠశాల అభివృద్ధి కోసం ఆయన చేసిన ఈ సేవా గ్రామంలో ప్రజల ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు.
రంగుల, కూలీల, ఇతర ఖర్చులు మొత్తం రూ.40,000/- అయింది అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హైదర్ బీ మాట్లాడుతూ పాఠశాలకు రంగులు వేయించి అభివృద్ధికి సహకరించిన దొడ్డ సుధాకర్ చౌదరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల అభివృద్ధి పట్ల ఆయన చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. దొడ్డ సుధాకర్ చౌదరి చేసిన ఈ సేవ అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శావ వెంకటయ్య, పాఠశాల చైర్మన్ పరమేశ్వరుడు, మాజీ చైర్మన్ బ్రహ్మయ్య ఆచారి, హరి, డాక్టర్ శివచారి, మద్దిలేటి, గుట్టుపల్లి పిచ్చయ్య, మంగలి మాలకొండయ్య, సామేలు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.