చనుపల్లి గ్రామంలో మంగళవారం ఉ

నేటి సాక్షి కోదాడ/అనంతగిరి (సతీష్ నాయక్)

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని చనుపల్లి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల నాణ్యత, మేటీల హాజరు, కూలీల పనితీరు, పనుల పురోగతి తదితర అంశాలను సోషల్ ఆడిట్ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా సోషల్ ఆడిట్ అధికారులు, బృందం సభ్యులు మాట్లాడుతూ....ఉపాధి హామీ పథకం కింద కూలీలకు సకాలంలో ఉపాధి కల్పించడంతో పాటు, పనుల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్థులు సైతం తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను సోషల్ ఆడిట్ బృందం దృష్టికి తీసుకెళ్లారు.
సోషల్ ఆడిట్ ద్వారా పనుల్లో ఏవైనా లోపాలు, అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని బృందం సభ్యులు పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నల్లా భూపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ నాగరాజ్, గ్రామ కార్యదర్శి రమాదేవి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు మధుసూదన్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ కుమ్మరి గురవయ్య, పంచాయతీ సిబ్బంది, ఉపాధి కూలీలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.