*బుగ్గారం(నేటి సాక్షి)అక్టోబర్ 15:*
దుర్గదేవి
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు గురువారం బుగ్గారం మండలం చందయ్యపల్లెలో దుర్గమాత *శ్రీ స్కందమాత* అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
*5వ రోజు విశిష్టత:*
నవదుర్గలలో ఐదవ అవతారం స్కందమాత. కుమారస్వామి అయిన స్కందుని తల్లి కావడంతో ఈ పేరు వచ్చింది. సింహ వాహనంపై నాలుగు భుజాలతో, ఒడిలో స్కందుడిని కూర్చోబెట్టుకుని దర్శనమిచ్చే ఈ తల్లిని పూజిస్తే సంతాన సౌభాగ్యం, జ్ఞానం, రక్షణ, మోక్షం లభిస్తాయని పండితులు తెలిపారు. ఈ తల్లిని పూజిస్తే స్కందుడిని పూజించిన పుణ్యం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకం.
*చందయ్యపల్లెలో ప్రత్యేక పూజలు:*
చందయ్యపల్లెలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో గురువారం ఉదయం నుండి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *ఎన్నం రాంరెడ్డి - వాణి, సార మోహన్ రెడ్డి - సరోజన, ఎన్నం కిషన్ రెడ్డి - మంజుల, సార కృష్ణారెడ్డి - మాధురి* దంపతులతో పాటు గ్రామస్థులు అమ్మవారికి ఒడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాదె మహేష్, ఉప సర్పంచ్ మ్యాకల వెంకటేష్, కొండ్రా భీమేష్, రాచర్ల భీమేష్, గాదె పోచమల్లు, భూపతి, కిరణ్, గడ్డం మహేష్,సార ఆయన్స్ రెడ్డి, సార ఆధ్వి రెడ్డి, గాదే రమేష్, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.