సాగిన భక్తులతో బుగ్గారంలో పండుగ

బుగ్గారం (నేటి సాక్షి )

బుగ్గారం మండల కేంద్రంలో డప్పుల చప్పుళ్లు.. నెత్తిన బోనాలతో కదిలిన మహిళలు.. దుర్గమ్మను కొలుస్తూ సాగిన భక్తులతో బుగ్గారంలో పండుగ సందడి నెలకొంది. బుగ్గారం గ్రామంలో గురువారం సాయంత్రం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను ఎత్తుకుని గ్రామంలో వాడవాడలా తిరుగుతూ శ్రీ ముత్యాలపోచమ్మ, శ్రీ నల్లపోచమ్మల ఆలయం నుండి దుర్గామాత మండపానికి చేరుకున్నారు. అమ్మవారి కి సామూహికంగా బోనాలు సమర్పించారు. భవానీ స్వాములు, మహిళలు, గ్రామస్థుల భాగస్వామ్యంతో వేడుక భక్తిభావాన్ని చాటింది.

*వాడవాడలా.. బోనాల సందడి*

డప్పుల మోతల నడుమ మహిళలు నెత్తిన బోనాలతో గ్రామ వీధుల గుండా సాగారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు కలిసికట్టుగా తరలిరావడంతో వాడవాడలా ఆధ్యాత్మిక సందడి కనిపించింది. గ్రామంలో తిరుగుతూ దుర్గామాత మండపానికి చేరుకున్న మహిళలు పూజల్లో పాల్గొన్నారు.దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న మహిళలు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుని సామూహికంగా బోనాలు సమర్పించారు. అమ్మపై విశ్వాసంతో సాగిన ఈ వేడుకలో భవానీ స్వాములు, గ్రామస్థులు పాల్గొన్నారు.