చేసుకొనని వారు వెంటనే ఓటరుగా

నేటిసాక్షి, నల్లగొండ : వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో ఉంటూ ఓటరు నమోదుకు అర్హత కలిగి ఉండి, ఇంకా ఓటరుగా నమోదు చేసుకొనని వారు వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నవంబర్ 1 ,2026 అర్హత తేదీగా వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి తాజా ఓటర్ల జాబితా రూపొందించడం జరుగుతున్నదని, అర్హులైన వారందరూ పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో కోరారు .
వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగాం ,ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోకి వస్తాయని, ఈ జిల్లాలలోని డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని ఆయన స్పష్టం చేశారు.
అర్హులైన వారు ఫారం 18లో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఓటరు నమోదుకు నోటీసు జారీ చేసిన సెప్టెంబర్ 28 నుండి నవంబర్ 6,2026 వరకు దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, నవంబర్ 25 న పట్టభద్రుల నియోజకవర్గ ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ముసాయిదా జాబితా పై నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను, ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని, ఈ ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం డిసెంబర్ 30, 2026 న పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టబద్రుల నియోజకవర్గం లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు నవంబర్ 1 ,2026 నాటికి మూడు సంవత్సరాల ముందు డిగ్రీ లేదా తత్ సమానమైన డిప్లమా పరీక్ష పూర్తి చేసి ఉండాలని, లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుండి సూచించిన విధంగా సమానమైన అర్హతలు కలిగి ఉండాలని , పట్టబద్రుల నియోజకవర్గ ప్రాంతంలో నివాసి అయి ఉండాలని ,సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థ జారీచేసిన ఒరిజినల్ డిగ్రీ డిప్లమా సర్టిఫికెట్ లేదా దాని నకలు సంబంధిత జిల్లాలోని డిజిగ్నేటెడ్ అధికారి లేదా అడిషనల్ డిజిగ్నేటెడ్ అధికారి లేదా గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరించి ఉండాలన్నారు. ఓటరుగా నమోదు చేసుకునే వారికోసం ఏ ఈ ఆర్ ఓ మరియు డిజిగ్నేటెడ్ అధికారి కార్యాలయాలలో తగినన్ని ఫారం- 18 లు అందుబాటులో ఉన్నాయని, ఆఫ్ లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఫార -18 తో ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, అదనపు ఎలక్ట్రోరల్ నమోదు అధికారి, మరియు నల్గొండ అదనపు కలెక్టర్, నోటిఫికేషన్ అధికారుల వద్ద ఫారం -18 లు స్వీకరించబడతాయని ఆయన స్పష్టం చేశారు .
ఆన్లైన్లో ప్రధాన ఎన్నికల అధికారి http://ceo telangana.nic.in ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. పట్టబద్రుల నియోజకవర్గం ఓటరు నమోదు విషయంలో ఏదైనా సందేహాలు, వివరణల కోసం పట్టబధ్రుల నియోజకవర్గ ఎలాక్టోరల్ నమోదు అధికారులు మరియు కాల్ సెంటర్ ద్వారా ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని, టోల్ ఫ్రీ నెంబర్ 1950 ద్వారా కూడా సమాచారం పొందవచ్చని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు.