నేటి సాక్షి కేసముద్రం :
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని గురువారం మహబూబాబాద్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విద్యుత్ కోతలపై రేవంత్ సర్కారుపై బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరులతో సమావేశం జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు భారం ఒకవైపు,నాణ్యత లేని ఉచిత విద్యుత్ సరఫరా మరోవైపు ప్రజలను, రైతులను తీవ్ర అవస్థలకు గురిచేస్తున్నాయని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సర్ఛార్జీలు, ట్రూ-అప్ ఛార్జీల పేరిట సాధారణ వినియోగదారులపై అదనపు భారాన్ని మోపడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శించారు.మరోవైపు గ్రామాల్లో వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంట పొలాలు ఎండిపోయి ఎడారిల మారే పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును చెప్పుకుంటున్నారు.నాణ్యమైన కరెంట్ అందక మోటార్లు కాలిపోవడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆందోళన చెందుతున్నారు.రేవంత్ సర్కార్ కమిషన్ల కోసం వారి స్వార్థాల కోసం రైతులను పట్టించుకోకుండా తమ అనుకూలమైన పనులు మాత్రమే చేసుకుంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా విద్యుత్ కోతలపై అసమర్ధ చేస్తే రైతులు నీరు లేక పంటలు పండక అప్పు తెచ్చిన కాడ కట్టలేక ఊరు విడిచి పొలాలు విడిచి పట్టణాలకు పై పని చేసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
*రైతులు ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రధానమైన డిమాండ్లు*
పెంచిన అదనపు విద్యుత్ ఛార్జీలను, ట్రూ-అప్ భారాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించాలి.విద్యుత్ కోతలను నివారించి సబ్స్టేషన్లలో సరైన మౌలిక వసతులు కల్పించాలి. ఇలాంటి సర్కార్ తుగ్లక్ పాలన చేస్తే వచ్చే ఎలక్షన్లో ప్రజల బుద్ధి చెప్తారని ఈ సమస్య గురించి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్ సమస్యలను పరిష్కరించకపోతే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు, రైతులతో కలసి నిరసనలు ఉధృతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటుగా డిమాండ్ చేసి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, బి ఆర్ ఎస్ టౌన్ ప్రెసిడెంట్ వీరు నాయక్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు , రావుల వినయ్ రెడ్డి, ఆగే రాము, పాయిరాల శరత్, దూడే పాక కృష్ణ, కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, హరి నాయక్, బానోత్ దేవేందర్, ఏర్పుల కుమారస్వామి,కన్నబోయిన శ్రీనివాస్ మరియు బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.