నకిరేకల్ పట్టణంలో దుర్గాదేవి

అక్టోబర్ 15 నేటి సాక్షి నకిరేకల్ రామగిరి వెంకటేశ్వర్లు.....

నకిరేకల్ పట్టణంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలోభాగంగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ సాయి మేఘన దంపతులు సాయినాధుని దుర్గామాతను దర్శించుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, దుర్గామాత అమ్మవారి దివ్య దర్శనం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు, ఒకరి జీవితంలో సుఖశాంతులు సంతోషాలు విరజిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు మహిళలు భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ తోనుపునూరి శ్రీనివాస్,యాట మధుసూదన్ రెడ్డి, నోముల గోవిందరాజులు,ఆలయ మర్యాదలతో సత్కరించడం జరిగింది. ఆలయ పూజారి దుర్గి మురళీధర్ శర్మ, జడ్జిని ఆశీర్వదించడం జరిగింది.