*నేటిసాక్షి* అక్టోబర్ 15 తిరుమలాయపాలెం (రుద్రరాజు).
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ గ్రామంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలు సందర్భంగా తన స్వగృహం నందు తల సేమియా వ్యాధి బాధితుల కోసం రక్తదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు. అలాగే సుబ్లేడ్ క్రాస్ రోడ్ నుంచి తిరుమలాయపాలెం మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జన్మదిన వేడుకల సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్డు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ నా జన్మదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రక్తదానం చేసిన యువకులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటూ వారి కష్ట సుఖాలలో నేను అండగా ఉంటూ నా రాజకీయ ప్రస్తావం ఇలాగే కొనసాగిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.